వైసీపీ లాంటి పైశాచికప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు: గంగారపు రాందాస్

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో టిడిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆరోగ్యం ప్రసాదించాలని అక్రమ కేసు నుండి త్వరగా బయటకు రావాలని జనసేన మరియు టిడిపి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు కలసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ ప్రజనీకం ఇంతకన్నా ఏమి చేయలేకపోతుందని ప్రశ్నిస్తే అరెస్ట్ లు, రోడ్డు మీదకు వస్తే అరెస్టులు, నిరసనలు చేస్తే అరెస్టులు, నిరాహార దీక్షలు చేస్తే అరెస్టులు ఇంతటి పైశాచికప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని తెలియజేసారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదని, ఒక సైకో చేతికి, ఒక పిచ్చివాని చేతికి రాష్టం అప్పచెప్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా ఉన్నాడని ప్రజలకి నరకం చూపిస్తన్నాడని విమర్శించారు. రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన, టిడిపి మైత్రిని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి విజయాభేరిని అడ్డుకోలేరని మదనపల్లిలో జనసేన, టీడీపీ సంయుక్తంగా జెండా ఎగురవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, మదనపల్లి టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రామసముద్రం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, రూరల్ ఉపాధ్యక్షలు కుమార్, టౌన్ ఉపాధ్యక్షులు కొలిమి ప్రసాద్, చంద్రశేఖర, మోహన కృష్ణ, అర్జున, జనార్దన్, హరినాథ్, కిషోర్, బావజన్, మల్లి రమేష్, శశి, నవాజ్, ఖలీం, పవన్ టిడిపి నాయకులు బాలు స్వామి, నవీన్ చౌదరి, హసీనా, నాగమణి, రెడ్డిబూ, బాలు పవర్ స్టార్ట్ తదితరులు పాల్గొన్నారు.