విజయోత్సవ సభను తలపించిన “బత్తుల” ఆత్మీయ సమావేశం

  • రాజానగరం గ్రామంలో “జనశ్రేణుల ఆత్మీయ సమావేశం” అత్యంత విజయవంతం
  • జనసేన – టిడిపి పొత్తులో భాగంగా.. రాజానగరం నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించినట్టు సేనాని ప్రకటన చేయడంతో నియోజకవర్గంలో అంబరాన్నంటిన సంబరాలు
  • 100% శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. టిడిపి శ్రేణులను గౌరవిస్తూ.. వారితో సమన్వయంతో పొత్తుధర్మాన్ని పాటిస్తూ…. భారీ మెజారిటీ లక్ష్యంగా ముందుకు సాగుతాం.. “బత్తుల”
  • రాజానగరం గ్రామం నుండి సుదీర్ఘ రాజకీయ అనుభవం, పట్టు ఉన్న కీలక సీనియర్ నేతలు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ కంచుపట్ల రామకృష్ణ, కంచుపట్ల కన్నారావు, ముద్దాడి అప్పారావు, కంచుపట్ల బాబ్జి, ఎం. అప్పలకొండ, మాజీ సర్పంచ్ కంచుపట్ల ప్రశాంతి గారు, మహ్మద్ పునీషా బేగం, గిత్త నాగలక్ష్మి, ఎం. దుర్గ, సుంకర లక్ష్మమ్మ, మనీషా బేగం గారు మరియు అనేక మంది వైఎస్సార్సీపీ నాయకులు జనసేన పార్టీలో చేరిక
  • వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జనసేన టిడిపి శ్రేణులు సమిష్టిగా, సంఘటితంగా పని చేయాల్సిన ఆవశ్యకతను వివరించిన బత్తుల బలరామకృష్ణ
  • రాష్ట్రంలోనే రాజానగరం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి.. తిరుపతి లడ్డూలా శ్రీ చంద్రబాబు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇద్దాం
  • జిల్లా నలుమూలల నుండి “బత్తుల” కు శుభాకాంక్షలు వెల్లువ
  • జనసంద్రంగా మారిన సమావేశ ప్రాంగణం
  • బత్తుల దంపతులకు అడుగడుగునా జననీరాజనం శ్రేణుల కేరింతలతో దద్దరిల్లిన సమావేశ ప్రాంగణం
  • ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే ఈ అరాచక వైసిపి ప్రభుత్వం పోవాలి
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అవినీతి వైసీపీకి ఓటేసిన పాపానికి ఇప్పుడు కుమిలిపోతున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు సరైన సమయంలో పొత్తు పెట్టుకున్నారు, టిడిపి సీనియర్ నేతలు గౌరవిస్తూ.. వారి సూచనలు, సలహాలు పాటిస్తూ.. రాజానగరం నియోజకవర్గంలో అవినీతి, అరాచక, దుర్మార్గపు పాలన చేస్తూ.. కోట్లాది రూపాయలు అక్రమార్జనతో, అధికారం మదంతో.. తనపై ఎన్నో అసత్యపు ప్రసారాలను చేసి, చేస్తున్న వైసీపీ నాయకులను తరిమి కొట్టి.. రాజానగరం నియోజకవర్గ సంపదను రక్షించుకుందాం, అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు సుపరిపాలనతొ సమన్యాయం చేద్దాం.. ఎన్నికల సమయం తక్కువ ఉన్నందున అందరూ మరింతగా కసిగా, కష్టపడాలని ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి “బత్తుల” పిలుపు”
  • రాజానగరం గ్రామం నుండి జనసేన పార్టీలో కొనసాగుతున్న వరస భారీ చేరికలు.. డీలాపడి నిర్వేదంలో కూరుకుపోయిన వైసిపి..
  • రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అవినీతి, అరాచకం, బ్లేడ్ బ్యాచ్ దురాగతాలు తారాస్థాయికి చేరాయి, వారిని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది యుద్దానికి సిద్ధమవ్వండి సైనికులారా.. వైసీపీపై రోమాలు నిక్కపొడుచుకునేలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన “బత్తుల”

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, రాజానగరం గ్రామంలో రాయల్ కన్వెన్షన్ హాల్లో శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజానగరం నియోజకవర్గాన్ని.. జనసేన టిడిపి పొత్తులో భాగంగా.. జనసేన పార్టీకి కేటాయిస్తూ ప్రకటించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని.. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం అలానే టిడిపి శ్రేణులతో సమన్వయం, వారిని గౌరవిస్తూ, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ. జన శ్రేణులకు దశదిశా నిర్దేశం చేయడానికి.. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన “జనశ్రేణుల ఆత్మీయ సమావేశం” నియోజకవర్గ నలుమూలల నుండి సీనియర్ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు భారీగా తరలి రావడంతో.. శ్రేణుల కేరింతల, ఆనందాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు జనసేన పార్టీలో చేరిన ‘బత్తుల’ దంపతులు ఈ రెండు సంవత్సరాల కాలంలో చేసిన సేవలు, రాత్రనకా పగలనకా నిరంతరం శ్రమించిన తీరును సంస్థాగత నిర్మాణం చేపట్టి క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని సామాన్య ప్రజలకు సైతం చేరువ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకు చేసిన ఆర్థిక సహాయాలు మరియు పాదయాత్ర ద్వారా వారు జనసేన పార్టీని రాష్ట్రం నలుమూలలా తెలిసేలా చేసిన తీరును కొనియాడుతూ బత్తుల బలరామకృష్ణ లాంటి నాయకుడు తమకు దొరకడం అదృష్టమని బలరామకృష్ణ గారి నాయకత్వంలో రాజానగరం నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి పరచుకుంటామని ఈ సందర్భంగా ప్రసంగించారు. అనంతరం శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు మాట్లాడుతూ.. ఈ రెండు సంవత్సరాల కాలంలో మాకు సహకరించిన నియోజకవర్గంలోని జనసేన నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు.. ఈరోజు జనశ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, ఎవరెన్ని నిందలు వేసినా.. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం మరింతగా పోరాడుతానే తప్ప.. రాజీ పడమని మీ అందరి సహకారంతో మేము పడిన కష్టాన్ని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఈ రోజు రాజనగరం నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం కల్పించారని, రానున్న రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో మరింతగా పార్టీ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడతానని.. మీ అందరి సహకారం ఇలానే ఉండాలని కోరుకుంటూ ఈ రెండు సంవత్సరాల కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’నన్నారు. అనంతరం రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, ఈ కార్యక్రమ విశిష్ట అతిథి శ్రీ బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎంతో నమ్మకంతో… కొంత కాలం క్రితం ఇన్చార్జి పదవిని, ఇప్పుడు రాజానగరం నియోజకవర్గ సీటును జనసేన పార్టీకి కేటాయిస్తూ, మాపై ఉంచిన నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటూ… వారి ఆశయాలను పూర్తిస్థాయిలో ముందుకు మరింతగా తీసుకువెళతామని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారి సేవలు రాష్ట్రానికి అవసరమని, నియోజకవర్గంలో టిడిపి శ్రేణులను గౌరవిస్తూ, వారితో సలహాలు సంప్రదింపులు అనుక్షణం జరుపుతూ.. రాజానగరం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ వచ్చేలా కష్టపడాలని, ఈ రెండు సంవత్సరాలు కాలంలో తన ఎదుగుదలకు… ఎంతో కష్టపడి పని చేసిన సీనియర్ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ…. వైసిపి నేతలు ఎన్నో అసత్యపు ప్రసారాలు చేసినా మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ధైర్యంగా ముందడుగు వేసి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగిందని… ఇదే సపోర్ట్ తొ రానున్న ఎన్నికల్లో మనమందరం సమిష్టిగా పనిచేసి, వైసీపీ విముక్త రాజానగరాన్ని సాధించి మన సంపదను కాపాడుకుందామని, అవినీతి లేని ప్రజా సుపరిపాలన అందించి, మన రాజానగరాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని పిలుపునిస్తూ.. పార్టీలో అభివృద్ధి కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని.. రానున్న ఎన్నికల్లో పూర్తిస్థాయిలో యుద్ధం చేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో రాజానగరం నియోజకవర్గాన్ని గెలిపి.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని, జనసేన పార్టీలో మా బాధ్యత మరింత పెరిగిందని.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని వమ్ము చేయబోమని రేపు రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పోరాడి.. భారీ మెజారిటీతో రాజానగరం సీటును జనసేన ఖాతాలో వేస్తామని తెలుపుతూ.. “జనశ్రేణుల ఆత్మీయ సమావేశం” ఇంత ఘనంగా నిర్వహించిన జనశ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అధికార వైసిపి వారు ఓటమి భయంతోనే జనసేన పార్టీపై, తనపై విషం కక్కుతున్నారని వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించిన మరింతగా పోరాడుతానే తప్ప, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పార్టీ కోసం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేస్తానని ప్రజల పక్షాన బలంగా నిలబడతానని పవన్ కళ్యాణ్ గారు గర్వపడేలా, టిడిపి శ్రేణులు గౌరవిస్తూ వారి సమన్వయంతో సహకారంతో రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తామని, 2024 రాజానగరం నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించిన సందర్భంగా మాకు అభినందనలు, శుభాకాంక్షలు, సత్కారుల అందజేసినందుకు నియోజకవర్గం ప్రజలకు, సీనియర్ నాయకులకు, జనసైనికులకు వీరమహిళలకు, టిడిపి సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న ఈ వైసీపీ సర్కార్ను ప్రజలందరూ ఐక్యమై త్వరగా ఇంటికి పంపాలని, సమాజానికి ఎంతో చేయాలని పరితపిస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీపరుడికి అలానే ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు గారి ఇరువురి నా నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చి ప్రజలందరూ ఆశీర్వదించి జనసేన టిడిపి కూటమిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, “జనసేన ఆత్మీయ సమావేశాన్ని ఘనవిజయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అన్నారు. ఈ సందర్భంగా రాజనగరం నియోజకవర్గ అసెంబ్లీ సీటును జనసేన టిడిపి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయిస్తూ నిన్నటి రోజున అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటనను స్వాగతిస్తూ ఆనందాలు వ్యక్తం చేస్తూ, నియోజకవర్గంలో నలుమూలల నుండి అనేకమంది తరలివచ్చి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి పుష్పగుచ్చాలతో అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ.. పార్టీ అభివృద్ధికి, నియోజవర్గంలో ఎంతోమంది పేద ప్రజలకు వారు చేసిన సేవలకు గుర్తుగా సాలువాలతో సత్కరించారు. నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీ ఎత్తున తరలి రావడంతో ఈ జనసేన ఆత్మీయ సమావేశం అత్యంత విజయవంతం అయింది.