జనసేన మరియు బిజెపి పార్టీల ఆత్మీయ సమావేశం

ఏలూరు నియోజకవర్గంలో కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అంబికా ఫ్లేవర్స్ నందు జనసేన మరియు బిజెపి పార్టీల ఆత్మీయ సమావేశం జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ బిజెపి పొత్తులపై ప్రధాన అంశాల మీద భవిష్యత్తు కార్యాచరణ పై రూపకల్పన చేయాలని రాబోయే ఎన్నికల్లో బిజెపి జనసేన పార్టీ కలిసికట్టుగా బూత్ స్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేసి కలిసికట్టుగా నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తపన ఫౌండేషన్ అధినేత స్టేట్ బిజేపి నాయకులు గారపాటి చౌదరి, ఏలూరు జిల్లా బిజెపి అధ్యక్షులు కొరెళ్ళ జ్యోతి సుధాకర్ కృష్ణ మరియు బిజేపీ నాయకులు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.