మొదటి రోజు పాదయాత్ర విజయవంతం

  • విజయవంతంగా సాగిన మొదటి రోజు వెలిగొండ ప్రాజెక్టు మరియు మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం పాదయాత్ర

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు వెలిగొండ ప్రాజెక్ట్ మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ తలపెట్టిన పాదయాత్ర మొదటి రోజు జనసంద్రంతో విజయవంతంగా సాగినది. ఈ పాదయాత్రకు జనసేన పార్టీ యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జి పాకనాటి గౌతమ్, జనసేన రాష్ట్ర కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, చీరాల నియోజకవర్గ జనసేన నాయకులు ఆమంచి స్వాములు, దర్శి నియోజకవర్గ ఇంఛార్జి బొటుకు రమేష్, జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున, తెలుగుదేశం పార్టీ మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి మద్దతు తెలిపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు, మార్కాపురం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.