డాక్టరేట్ సాధించిన పిట్టా వరప్రసాద్ కు ఘన స్వాగతం

పెద్దాపురం: సామాజిక సేవలకు గుర్తింపుగా పలువురికి భారత ప్రభుత్వం, యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా ప్రభుత్యాలు ఆమోదం పొందిన వరల్డ్ పీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ వారు డాక్టరెట్ ప్రధానోత్సవంలో భాగంగా జూన్ 4వ తేదీన న్యూ ఢిల్లీ 15 జనపద్ నందుగల డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ నందు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్ కు డాక్టరెట్ ప్రధానం చేయగా ఢిల్లీ నుండి ప్రత్యేక రైలులో పిట్టా వరప్రసాద్ బుధవారం ఉదయం సామర్లకోట చేరుకోగా పెద్ద ఎత్తున అభిమానులు రైల్వే స్టేషన్ కు చేరుకుని పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పిట్టా జానకి రామారావు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్, కార్యదర్శి అర్జున్, చెన్నై ఏడుకొండలు, ఎమ్మార్పీఎస్ నాయకులు అరుణ్ కుమార్, జనసేన నాయకులు రాజాల శ్రీను, ప్రముఖ దళిత నాయకులు తర్లంపూడి కమల్ రాజ్, మాజీ రిటైర్డ్ ఎస్సై పిట్టా మనీరాజ్, కోటబజార్ పేట అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, బలుసుల పేట అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, సామర్లకోటలోని పెట్ట వారి కుటుంబ సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొని స్టేషన్ సెంటర్ నుంచి పాత ఎమ్మార్వో సెంటర్ మీదుగా కోటబజార్పేట బలుసుల పేటలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహాలకి పూలమాల వేయడం జరిగింది.