ఆగని గిరిజన తల్లుల కడుపు కోత

  • గిరిజన ప్రాంతాల్లో శిశుమరణాల రేటు శాతం అధికారికంగా వెల్లడించాలి
  • చింతపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వంతల బుజ్జిబాబు

పాడేరు: ఆదివాసీ ప్రాంతాల్లో శిశుమరణాలు, బాలింత మరణాలు నానాటికి అధికమవుతోంది. ఈ మరణాలకు వాస్తవలేమిటో అమాయక గిరిజనులకు అంతుచిక్కని ప్రశ్నగా మారిందని చింతపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వంతల బుజ్జిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం కొయ్యురు మండలం కంబుర్ల గ్రామంలో రహదారి వ్యవస్థ లేక డోలి మోతతో ప్రసవ వేదన పడుతున్న నిండు శూలాలు మృత్యువాత పడింది, చింతపల్లి మండలం, లింగలగుడి గ్రామ దంపతులు పరమేశ్వర్రావు, సీతమ్మల శిశువు ఉన్నట్టుండి హటాత్తుగా మరణించింది. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం బంధబయలు గ్రామస్తులైన వంతల పరమేశ్వర్రావు, సీతమ్మ దంపతులకి మూడు నెలల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చారు. బుధవారం ఆధార్ కార్డ్ అప్డేట్ కోసమని సోమవారం అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడనుంచి పాప కాస్త అస్వస్థతకు గురయ్యింది. దగ్గరలో లోతుగెడ్డ ఆస్పత్రికి తీసుకెళ్దాం అనుకునే లోపే మార్గమధ్యలోనే శిశువు మృత్యువాతపడింది. పరమేశ్వర్రావు దంపతులకు అర్థంకాక ఏమిచేయలో తెలియక దుఃఖంతో కాలినడకనే స్వస్థలమైన బంధబయలు గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ చింతపల్లి మండల నాయకులు వంతల బుజ్జిబాబు స్పందిస్తూ ఇలాంటి శిశు మరణాలు, బాలింత మరణాలు, గర్భిణీ మరణాలు గత నాలుగు సంవత్సరాలుగా అధికమవుతుంది. ఒక్కసారి ఈ సమస్యకు గల మూల కారణాలను పరిశీలిస్తే.. మాత శిశు సంరక్షణ శాఖ ద్వారా గర్భిణులకు పోషకాహార ఏర్పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం తరపున సక్రమంగానే అందుతున్నప్పటికి గ్రామస్థాయిలో నియమించిన ఆరోగ్య కార్యకర్తలకు సరైన శిక్షణ, నిరక్షరాస్య గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించడంలో మాత శిశు సంరక్షణ శాఖ, ప్రజా వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం చేయడం ఒక ప్రదాన కారణంగా చెప్పవచ్చు. ఈ విషయంలో ఒక్కసారి మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో చైతన్యం కల్పించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా పూర్వం ఎటువంటి హాస్పిటాలిటీ సౌకర్యం లేకపోయినప్పటికీ శిశు మరణాలు ఇంతా ఎక్కువగా లేదనేది వాస్తవం. రోజురోజుకీ గిరిజనులు సహజ వ్యాధినిరోధక శక్తి కోల్పోతున్నారు. సాంకేతిక విజ్ఞానం పెరిగినప్పటికి ఆహార వ్యవస్థలో, అవగాహన విషయంలో పెనుమార్పులు సంభవించడం గిరిజనులపాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతాల్లో శిశుమరణాల రేటు శాతం అధికారికంగా వెల్లడించాలి. తద్వారా తీసుకునే చర్యలు ప్రాధమికస్థాయిలో అవగాహన తరగతులు ఆరోగ్యకార్యకర్తలకు కల్పించి కట్టడి చెయ్యాలి. గిరిజన ప్రజారోగ్యవ్యవస్థ మెరుగు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజితగదన్నారు. ఈ అంశాన్ని రాజకీయాలతో చూడకుండా గిరిజన సహజ మనుగడలో వచ్చే మార్పులు చూసి, తీసుకోవాలిసిన జాగ్రత్తల విషయంలో ప్రజాప్రతినిధులు ఏకం కావాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని వంతల బుజ్జిబాబు తెలిపారు.