ఆచంట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం

ఆచంట నియోజకవర్గ ఇంచార్జి చేగొండి సూర్యప్రకాష్ ఆదేశాల మేరకు మార్చి 14న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఎలా తరలి వెళ్ళాలి అనే అంశం పై స్థానిక పెనుగొండ గ్రామంలోని బాలాజీ కన్వెన్షన్ నందు మండల పార్టీ అధ్యక్షుడు కంబాల బాబులు అధ్యక్షతన ఆచంట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాలుగు మండలాల అధ్యక్షులు పాల్గొని, ఆవిర్భావ సభకు తరలి వెళ్ళడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని తెలిజేసారు. మరియు ఇంచార్జ్ చేగొండి సూర్యప్రకాష్,నాలుగు మండలాలకు నాలుగు బస్సులు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఈ ఆవిర్భావ సభకి వెళ్ళి సభని విజయ వంతం చేస్తామని ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఏకగ్రీవంగా నిర్ణయాన్ని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య, జిల్లా కార్యదర్శి అడ్డాల దుర్గ,ఆచంట మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ, పెనుమంట్ర మండల అధ్యక్షులు కొయా కార్తీక్, ఆచంట మండలం వైస్ ఎంపీపీ యర్రగొప్పుల నాగరాజు,జిల్లా సంయుక్త కార్యదర్శి రావి హరీష్, జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కొండవీటి శ్రీనివాస్,తోట సురేంద్ర బండారు శేఖర్, రామన్నపాలెం ఎంపీటీసీ మొఖమాట్ల కృష్ణకాంత్ మరియు ఆచంట, పెనుమంట్ర మండల ఎంపీటీసీలు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.