జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి: రాయదుర్గం తేజ లక్ష్మి

*జనసేన పార్టీ ఆవిర్భావ మహా సభకు మహిళలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయండి: జనసేనపార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీమతి రాయదుర్గం తేజ లక్ష్మి

రాయలసీమ, మార్చి 14 న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పంట గ్రామంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ మహా సభకి రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీమతి పెండ్యాల శ్రీలత, పసుపులేటి పద్మావతిల పర్యవేక్షణలో పెద్దసంఖ్యలో మహిళలు హాజరవుతున్నారని, నార్పల మండలం నుండి మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జనసేన పార్టీ ఆవిర్భావ మహా సభను విజయవంతం చేయాలనీ నార్పల 4వ ఎంపిటిసి జనసేనపార్టీ అభ్యర్థిని శ్రీమతి రాయదుర్గం తేజ లక్ష్మి పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహిళలపట్ల ఎంతో అంకితభావం తో పని చేస్తున్నారని, పార్టీలో మహిళా కమిటీలను ఏర్పాటు చేసి రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి మహిళలకు గొప్ప అవకాశాల్ని జనసేన పార్టీ అధినేత అందించారన్నారు. గత పంచాయితీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన మహిళలను గుర్తించి వారికీ ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్బంగా సన్మాన చేయడం మహిళల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని, వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ఖండిస్తూ.. అధినేత అడుగుజాడల్లో నడుస్తూ.. ప్రజల్ని చెతన్య పరచడంలో మహిళలు ముఖ్య పాత్ర పోషించాలని.. వైసీపీ ప్రభుత్వం సభ సజావుగా జరగనీయకుండా ఎన్నో కుట్రలు చేస్తోందని, జనసైనికులు వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ విజయవంతం చేసి జనసేనపార్టీ సత్తా ఏంటో చూపించాలని కోరారు. సభలో అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేలా అధినేత ప్రసంగం ఉంటుందన్నారు.