రవీంద్ర రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. పోలీసులకు జనసేన ఫిర్యాదు

కాకినాడ రూరల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాల మీద సహేతుకమైన విమర్శలు చేసినప్పుడల్లా వాటికి సమాధానం చెప్పలేని వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం పరిపాటి అయిపోయింది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ కుటుంబంలోని స్త్రీలను టార్గెట్ చేసి దుర్భాషలు మాట్లాడడం జరుగుతోంది. ముఖ్యంగా శనివారం వర్రా రవీంద్రరెడ్డి అనబడే కుసంస్కారి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టింగులు సభ్య సమాజం తలదించుకొనేలా ఉన్నాయి. ఈ విషయంపై శాంతిభద్రతలు కాపాడవలసిన గురుతర బాధ్యతలో ఉన్న మీరు సదరు అసాంఘిక వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మహిళల గౌరవాన్ని, ప్రజల హక్కులను కాపాడవలసిందిగా కోరుచూ వారి మీద ఎఫ్.ఐ.ర్ వేయవలసిందిగా జనసేన నాయకులు కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, కరప పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కరప గ్రామ అధ్యక్షులు పేకెటి దుర్గాప్రసాద్, కరప మండల అధ్యక్షులు బండారు మురళి, సీనియర్ నాయకులు భోగి రెడ్డి కొండబాబు, యళ్ళ హరినాథ్, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప మండల ఉపాధ్యక్షులు సైనివరపు భవాని శంకర్, అనుకుల రాంబాబు, సుందర సత్తిబాబు, మండల కమిటీ సభ్యులు పప్పులు మల్లి బాబు, పేపకాయల పవన్ కుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ నల్లే ప్రసన్నకుమార్, జనసేన పార్టీ నియోజకవర్గ ఐటీ విభాగం నుండి గంటి యారిస్, నియోజకవర్గ ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుడు బండారు మణికంఠ, కరప మండల నాయకులు జిల్లెల్ల ప్రసాద్, యళ్ల వీర వెంకట సత్యనారాయణ, పుణ్యమంతుల సత్యనారాయణ, కోన వీరభద్ర రావు, శాఖ శ్రీనివాస్, గొల్లపల్లి చంద్రశేఖర్, శాఖ వంశి, చెక్కపల్లి మణికంఠ, జనసేన కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.