క్రియాశీలక సభ్యత్వం మీ భద్రతకు భరోసా

చింతపల్లి మండలం, లోతుగెడ్డ పంచాయితీ, చెరపల్లి గ్రామంలో జనసైనికుడు దేపురు రాజు ఆధ్వర్యంలో జరిగిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు విశిష్టత, జనసైనికుల రక్షణార్థం అధినేత పవన్ కళ్యాణ్ అన్న ఆశయాలకు అనుగుణంగా రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప భద్రత. దయ చేసి యువకులు పార్టీ ఆశయాలకు ఆకర్షితులై క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకుంటే మీ భద్రత కు ఒక భరోసా ఉంటుంది. మీ కుటుంబానికి ఒక భద్రత కల్పించేది కేవలం జనసేన అశయాలతో కూడిన విధానమే ఒక రక్ష అంటూ తోటి యువకులకు జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ జనసైనికుడు దేపురు రాజు తెలిపారు.