పొంగుటూరులో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

పోలవరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం గురువారం పోలవరం నియోజకవర్గంలో ఏడు మండలాల్లో ప్రారంభించడం జరిగింది. కొయ్యలగూడెం మండలం, పొంగుటూరు గ్రామంలో తోట రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమము వెనుకనున్న గొప్ప ఉద్దేశాన్ని వివరిస్తూ.. ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ చేయనంత గొప్పగా, కార్యకర్తల కోసం ఆలోచించే గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు అని, సుమారు 5000 సభ్యత్వాలు చేశామన్నారు. ఏ అధికారం లేకుండా ఇంత చేస్తున్నారంటే అధికారం ఇస్తే ఇంకెంత చేస్తారో ఆలోచించుకోవాలన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి, సభ్యత్వాలు చేసిన ప్రతి వాలంటీర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గేలం భాస్కరావు, అల్లం సత్తిరాజు, ప్రగడ రమేష్, ప్రగడ లక్ష్మణ్ దొర, పసుపులేటి రాజు, మల్లాబతుల రాము, కాకపాటి వంశీ తదితరులు పాల్గొన్నారు.