వారాహి యాత్రలో జనసేనానికి తగిన భద్రత కల్పించాలి..

కాకినాడరూరల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల ముందుకు జూన్ 14వ తేదీన కాకినాడ జిల్లా అన్నవరం నుండి వారాహి యాత్ర ప్రారంభిస్తున్న సందర్బంగా పవన్ కళ్యాణ్ గారికి తగిన భద్రత కల్పించాలని కోరుతూ.. జిల్లా అడిషనల్ ఎస్.పి కి, మరియు కాకినాడ డి.ఎస్.పి కీ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, పెద్దాపురం ఇంచార్జ్ తుమ్మల బాబు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.