అక్రమ గ్రావెల్ దందాలపై చర్యలేవి?.. బొబ్బేపల్లి సురేష్ ధ్వజం

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచల మండలం, సర్వేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయం నందు శుక్రవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో భాగంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో రూ.కోట్ల రూపాయల విలువచేసే గ్రావెల్ ను అక్రమంగా గ్రావెల్ మాఫియా కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా వెంకటాచల మండలంలో ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా నెల్లూరు నగరానికి రూ.కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ ను అక్రమంగా తరలింపు జరుగుతుంది. పర్మిషన్ తీసుకునేది పేదల ఇళ్ళ నిర్మాణానికి గ్రావెల్ తోలకాలు అని, కానీ పెద్దల ప్లాట్ లకి, అదేవిధంగా కనుపూరు చెరువులో పర్మిషన్ తీసుకునేది గోరంత, దోచుకునేది కొండంత. ఇరిగేషన్ అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, ఎవరు కూడా ఎందుకని గ్రావెల్ మాఫియా దందాపై ఉక్కు పాదం మోపడం లేదు. ఎందుకని అరికట్టడం లేదు?. అంటే ప్రభుత్వ అధికారులకు కూడా అందులో వాటా ఉందా?. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఏమైనా జరుగుతుందా?. అందుకేనా వీళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉన్నారు. గ్రావెల్ మాఫియాపై ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రభుత్వ అధికారులు గానీ 24 గంటల్లో చర్యలు తీసుకోకపోయినా, గ్రావెల్ మాఫియా కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను ఆపకపోయినా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలను పూర్తిస్థాయిలో అడ్డుకోవడంతోపాటు, గ్రావెల్ దందాకు పాల్పడుతున్న గ్రావెల్ మాఫియాపై ప్రభుత్వ అధికారులు ఉక్కు పాదం మోపే అంతవరకు ఉద్యమం చేస్తాం. గతంలో కూడా గనుల శాఖ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకుంటామని చెప్పేరే కానీ.. పూర్తిస్థాయిలో గ్రావిల్ మాఫియాని అరికట్టింది లేదు. ప్రభుత్వ యంత్రాంగం గ్రావెల్ మాఫియాను అడ్డుకోకుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, రహీం, శీనయ్య, సుధాకర్, వెంకయ్య, శ్రీహరి, చిన్న, ఫణి తదితరులు పాల్గొన్నారు.