గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అదితి రావ్‌ హైదరి

‘ఆర్.ఎక్స్‌ 100’ ఫేం అజయ్‌ భూపతి రూపొందిస్తున్న ‘మహాసముద్రం’ సినిమాలో నటించడానికి అదితి రావ్‌ హైదరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తాజాగా ఈ విషయాన్ని నటిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి మధ్య తరగతి అమ్మాయి పాత్రలో నటిస్తుంది.

దర్శకుడు అజయ్‌ భూపతి, ఆమె పాత్రను మలచిన తీరు నచ్చడంతో సినిమాలో నటించడానికి అదితి రావ్‌ అంగీకరించారట. సిద్ధార్థ్‌, శర్వానంద్‌ ఇద్దరు హీరోలు నటిస్తుండడంతో మరో కథానాయికకూ చోటుందని తెలుస్తోంది. ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైన ‘వి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది అదితి. ‘మహాసముద్రం’ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.