రాబోయే 72 గంటలపాటు భారీ వర్ష సూచన

వాతావరణశాఖ హైదరాబాద్ కు మరో 72 గంటలపాటు అతి భారీ వర్ష సూచన చేసింది. కొన్నిచోట్ల 9 నుంచి 16 సెంటిమీటర్ల వర్షం పడొచ్చని తెలిపింది. దీంతో GHMC అధికారులను అప్రమత్తం చేస్తోంది. మాన్ సూన్ బృందాలు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు GHMC కమిషనర్ లోకేష్ కుమార్. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని కోరారు. మరోవైపు నగరంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు నోటీసులు ఇచ్చి.. అందులో ఉన్నవాళ్లను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. అధికారులు అలర్ట్ గా ఉండాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సూచించారు.