దత్తపుత్రుడు ప్యాకేజీ అంటే పాదరక్షకులు విరిగిపోతాయి.. జగన్

అనంతపురం జనసేన కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేసంలో జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం భావితరాల భవిష్యత్తు కోసం జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకత ఓటు చీలకుండా రాష్ట్రంలో మిగిలిన ప్రధాన పార్టీలు కలుపుకొని వచ్చే ఎన్నికలకు సిద్ధం అని చెప్పగానే.. నీ గుండెల్లో గుబులు మొదలైందా జగన్? అసహనముతో నీవు మాట్లాడుతున్న తప్పుడు మాటలని ఖండిస్తున్నాం? నీ కల్లిబుల్లి మాయ మాటలు, నీ పతివ్రత మాటలు.. ఇంక మేము నమ్మం జగన్!!. ఇంక ప్యాకేజీ, దాచుకోవడం దోచుకోవడానికి విషయానికొస్తే …గురిగింజ తన నలుపు ఎరగదు అన్నట్లు మీ తాత గారి రాజారెడ్డి హయాంలో పులివెందుల, కదిరి పరిసర ప్రాంతాల్లో దారి దోపిడీలు దొంగతనాలు చేయించింది ఎవరు? జగన్. మీ తండ్రిగారి పాలన అడ్డం పెట్టుకొని సూట్ కేస్ కంపెనీలు సృష్టించి వేల కోట్లు దోచుకుని.. సాక్షి పత్రిక, భారతి సిమెంట్, సున్ డూరు ప్రవర్ ప్రాజెక్టు లాంటి కంపెనీలు స్థాపించింది ఎవరు? జగన్. లోటస్పాండ్, బెంగళూరు ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్ లాంటి ఎన్నో విలాసవంతమైన వనరులను సమకూర్చుకుంది ఎవరు? జగన్…. ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా సమకూర్చుకున్నావో ప్రజలకు వివరించగలవా? జగన్.. నీ అవినీతి సామ్రాజ్యాన్ని ఎలా ఏర్పరచుకున్నావో ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా?. నీ నాలుగేళ్ల పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిత్తిపోయారు ఎన్నికల వస్తే నీకు నీ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అధికార మదమెక్కి తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం పాదరక్షకులు ఇరిగిపోతాయని హెచ్చరించారు.