జనసైనికుడు మల్లాడి నూకరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: ఇటీవల ఆక్సిడెంట్ లో మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు, తాళ్లరేవు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన అగ్నికుల క్షత్రియ యువకుడు మల్లాడి నూకరాజు (27) కుటుంబ సభ్యులను బుధవారం జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అందించే క్రియాశీలక సభ్యత్వ భీమా 5 లక్షల రూపాయలు త్వరగా వచ్చేలా కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. వారితో తాళ్లరేవు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు అత్తిలి బాబురావు, రామన్నపాలెం రాజు, ఒలేటి అప్పారావు నాని, పోతాబత్తుల రాంబాబు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.