ఇంటి వద్దే త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి స్వతంత్ర వేడుకలు జరుపుకొన్న అద్వానీ, అమిత్‌షా

భారత సమరయోధులు కలలుగన్న స్వతంత్ర, స్వయం సమృద్ధ భారత్‌ మోదీ నాయకత్వంలో సాధ్యం కాగలదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. శనివారం తన ఇంటి వద్ద ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. స్వాతంత్య్రపోరాటంలో ప్రాణత్యాగం చేసిన యోధులకు ఆయన అంజలి ఘటించారు.  మోదీ పంద్రాగస్టు ప్రసంగం ప్రజలను ఉత్తేజితం చేసేలా ఉందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని తన ఇంటి వద్ద మువ్వన్నెల జెండాను ఎగరేసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎ్‌సఎస్‌) ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ జెండాను ఎగరేశారు.