అగంపాడులో జనసేనలో భారీ చేరికలు

పాడేరు నియోజకవర్గం: జి.మాడుగుల మండలం బీరం పంచాయితీ పరిదిలోని అగంపాడు గ్రామస్తుల పిలుపు మేరకు వారితో సమావేశమైన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా వంపూరు గంగులయ్య మరియు స్థానిక మండల నాయకులు. జనసేన పార్టీ కి పాడేరు నియోజకవర్గంలో విపరీతమైన ఆదరణ లభిస్తోందనడానికి ఆగం పాడు గ్రామం ఒక ఉదాహరణ మాత్రమేనని చెప్పాలి. జనసేనపార్టీ నాయకులను మా గ్రామస్తులే స్వచ్ఛందంగా పిలిచామని ప్రస్తుతం చూస్తున్న విపరీత రాజకీయాలు గిరిజన స్థితిగతులపై క్షున్నంగా తెలుసుకుని మేము జనసేనపార్టీలో చేరాలని నిశ్చయించుకున్నాము అందుకే మిమ్మల్ని ఆహ్వానించామని అన్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ఇన్చార్జ్ గంగులయ్య మాట్లాడుతూ జాతి మొత్తం నష్టపోయే విదంగా రాజకీయ పన్నాగంలో చిక్కుకున్నారు. మన ప్రజాప్రతినిధులు ఈ విషయం వారికి తెలియకపోవచ్చు కానీ సమస్యలపై నిరంతర పోరాటం చేసి ప్రజాపక్షాన నిలబడే మన కళ్ళకు గంతలుకట్టి గిరిజన రాజకీయాలు చేస్తామని అనుకునే ఈ ప్రజాప్రతినిధుల మూర్ఖత్త్వాన్ని కూడా గమనించాలని అన్నారు. అలాగే చట్ట సభల్లో మన గిరిజన ప్రజా గొంతుక బలంగా వినిపించకపోతే మన ఆస్తిత్వంపై మనమే గొడ్డలి వేటు జరిపించినట్టేనని అన్నారు. గ్రామస్తులు మొత్తం జనసేన పార్టీ కండువా గంగులయ్య, రాజన్ ల చేతుల మీదుగా కప్పుకుని పార్టీ లోకి చేరారు. వారికి గంగులయ్య సాదరంగా ఆహ్వానించారు. జనసేనపార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ సిద్ధాంతపు రాజకీయాలు, ఆధివాసి సమాజపు అస్థిరత విషయాలు సంపూర్ణాంగా తెలుసుకున్నకే ఈ గిరిజన జాతి మనుగడ సాధ్యమని ఆ విషయం ప్రతి ఒక గిరిజన సోదరులు తెలుసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా ఈ సమావేశంలో జనసేనపార్టీ నాయకులు జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, తల్లే త్రిమూర్తి, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, తాంగుల రమేష్, కొర్ర భానుప్రసాద్, సాగెని ఈశ్వర్రావు, సాగెని బాలకృష్ణ, దుక్కిరి బుజ్జిబాబు, మజ్జి సత్యనారాయణ, మజ్జి నగేష్ కుమార్, మజ్జి సంతోష్ బీరం గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.