గోచక్క పంచాయతీలో ఆగురు మణి పర్యటన

పార్వతీపురం: గోచక్క పంచాయతీలో పార్వతీపురం జనసేన మండల అధ్యక్షురాలు ఆగురు మణి ఆదివారం పర్యటించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ జనసైనికులు, వీరమహిళలు, జనసేననాయకులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఆ గ్రామంలో రామ్ మందిరం కోసం కొంత విరాళం ఇవ్వడం జరిగింది. అలాగే గోచక్క పంచాయతీ సమస్యల గురించి ఆ గ్రామ ప్రజలు ఆగురు మణి కి విన్నవించారు. మీ సమస్యలు ఎన్నింటికి పరిష్కారం చేస్తామని ఆగురు మణి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆగురు మణి జనసైనికులకు, గ్రామ ప్రజలకు మా హృదయపూర్వక అభినందనలు. మీరు చూపించిన ప్రేమ అభిమానులకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ ప్రోగ్రాంలో మన జనసేన నాయకులు అక్కివరపు మోహన్ రావు గారికి, సీతానగరం మండల నాయకులు రమేష్ గారికి, జిల్లా నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లు గణేశ్వరరావు, కర్రీ మణికంఠ, అన్న బత్తుల దుర్గాప్రసాద్, చంద్రశేఖర రావు, గోచక్క పంచాయతీ గ్రామ సభ్యులందరికీ, పార్వతీపురం మండలం జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.