బక్రీద్ వేడుకలలో పాల్గొన్న అక్కల రామ్మోహన్ రావు

మైలవరం నియోజకవర్గం: బక్రీద్‌ సందర్భంగా దేశవ్యాపంగా గురువారం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని మైలవరం నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో బక్రీద్‌ ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ )ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ పంపిన చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకుమల్లి సురేష్ కుమార్, ఎర్రంశెట్టి నాని, యతీరాజులు ప్రవీణ్, రామాంజినేయులు, నాగబాబు, సామల సుజాత, కొత్త గేటు సురేష్, రమేష్, హేమంత్, వెంకట్ సాయి, రామ్ ఆంజి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.