అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ

వీరఘట్టం: అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శనివారం వీరఘట్టం మండలం అయ్యప్ప స్వామి సన్నిధానంలో జరిగింది. ఈ కార్యక్రమం కెల్లా రాంబాబు గురు స్వామి సమక్షంలో వీరఘట్టం మండలానికి సంబంధించిన ప్రతి గ్రామ గురు స్వాములు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలకొండ రుద్ర గురు స్వామి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశిస్తూ అయ్యప్ప యొక్క నియమ నిబంధనల గురించి.. అయ్యప్ప మహిమల గురించి ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు తెలియపరచాలని.. అలాగే ప్రతి గ్రామంలో అయ్యప్ప స్వామి సన్నిధానం ఖచ్చితంగా ఉండేటట్లుగా భక్తులు ప్రజలు ఆ యొక్క బాధ్యతలు తీసుకోవాలని కోరడం జరిగింది.