అక్ష‌య్ కుమార్ కు మాతృ వియోగం

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ త‌ల్లి అరుణా భాటియా ముంబైలోని ఆ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఆమెకు ఆరోగ్యం స‌రిగ్గా లేద‌ని, ఆసుప‌త్రిలో చేర్పించార‌ని తెలియ‌గానే అమెరికాలో ఉన్న అక్ష‌య్ కుమార్ హుటాహుటిన ఇండియాకు వ‌చ్చారు. ఆమెతోనే ఆసుప‌త్రిలో ఉన్నారు.


అయితే, డాక్ట‌ర్లు ఎంత ప్ర‌య‌త్నించినా అమ్మ‌ను ద‌క్కించుకోలేక‌పోయామ‌ని అక్ష‌య్ కుమార్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. త‌నే నాకు స‌ర్వ‌స్వం. ఆ బాధ‌ను త‌ట్టుకోలేక‌పోతున్నా. మా అమ్మ త‌న‌ను వీడి మ‌రో లోకంలో ఉన్న నా తండ్రి వ‌ద్ద‌కు చేరింది. ఓం శాంతి అంటూ పోస్ట్ చేశాడు.