అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సమ్మెకి సంఘీభావం తెలిపిన అళహరి సుధాకర్

కావలి, అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకి జనసేన పార్టీ నాయకులతో కలిసి జనసేన పార్టీ తరపున మహిళలను కలిసి మద్దతు తెలిపిన కావలి నియోజకవర్గ ఇంచార్జి అళహరి సుధాకర్. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ అంగన్వాడి కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రాష్ట్రంలో పసిపిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు అందరు జగనన్న బాధితులే అని ఎద్దేవా చేసారు, జనసేన టీడీపీ ప్రభుత్వంలో మీ డిమాండ్లన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం అని అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్, వారికీ అళహరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ పొబ్బా సాయి, గాధంశెట్టి రవికుమార్, మానేపల్లి రిషికేష్, ఆలా శ్రీనాథ్, గుంటుపల్లి కృష్ణయ్య, తోట శరన్, ఆగస్టీన్ ప్రభాకర్, జ మాలకొండయ్య మల్లికార్జున, సందీప్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.