మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వేగుళ్ళ లీలాకృష్ణ

*తాతపూడిలో అక్రమ మట్టి తవ్వకాలు
*అనుమతులు లేకుండా బరితెగింపు
*ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హస్తం
*చూసి చూడనట్టు అధికారులు
*అడ్డుకున్న జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

కపిలేశ్వపురం: కపిలేశ్వపురం మండలం, తాతపూడి, కేదార్లంక మధ్య గోదావరి నదీ ప్రవాహనికి అడ్డంగా అక్రమంగా రోడ్డు పోసి వైస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగే అక్రమ మట్టి తవ్వకాన్ని మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పార్టీ నేతలతో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్.సి.ల పేరిట ప్రతిరోజు వేలాది లారీలు అక్రమ మైనింగ్ తో తప్పుడు పర్మిషన్ తో రాత్రి, పగళ్ళు మట్టిని తవ్వేసి యథేచ్ఛగా తరలిస్తున్నారని ఆయన విమర్శించారు. మట్టిని అక్రమంగా తరలిస్తూ రోజుకి రూ 50 లక్షలు జేబుల్లోకి వెళుతున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ర్యాంపులోకి లీలాకృష్ణ చేరుకోగా ఆయన వస్తున్నారని తెలుసుకొని అక్కడ పనిచేసే వాళ్ళందరూ పారిపోయి, భారీ ప్రొక్లెయిన్ ల్లు గడ్డి పొదల్లో దాచేశారన్నారు. నిబంధనలన్ని తుంగలో తొక్కి బరి తెగిస్తూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కనుసన్నల్లోనే ఇష్టారాజ్యంగా మట్టిని తెగనమ్మి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలా నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ప్రజా ధనం దోచుకుంటున్నారని పేర్కొన్నారు. అన్నీ తెలిసి జిల్లా కలెక్టర్ నోరుమెదపకపోవడం దారుణం అన్నారు. అక్రమంగా మట్టిని దోచుకుంటున్న వైస్సార్సీపీ పార్టీ నేతలపై అధికారులు వెంటనే స్పందించి తవ్వకాలు నిలిపివేయడంతో పాటు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే పరిధి మించి తవ్వకాలు జరిపారని, ఇక్కడితో ఇది ఆపేయాలని సూచించారు. ఇక్కడితో ఈ తవ్వకాలను నిలువరించకపోతే మరింత ప్రత్యక్ష ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు.