పొత్తు ఉన్నా లేకపోయినా ఏలూరు నుండి జనసేన పోటీ ఖాయం: రెడ్డి అప్పలనాయుడు

  • పార్టీ కేడర్ ను ఉత్తేజపరిచిన నాయుడు

ఏలూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు ఉన్నా లేకపోయినా ఏలూరు నియోజకవర్గం నుండి జనసేన పోటీ ఖాయమని ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు పార్టీ కేడర్ ను ఉత్తేజపరిచారు. ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఆఫీస్ బేరర్స్, కార్యవర్గ సభ్యులు అన్ని డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ.. 2019 ఎన్నికల తర్వాత పార్టీ క్యాడర్ ఉన్నంతలో, వయసులో, అనుభవంలో తిన్నవారైనప్పటికీ, నియోజకవర్గ ఇన్చార్జిగా కానీ తీసుకునే నిర్ణయాలకు, పార్టీ యిచ్చే విశ్రుంఖలమైన పిలుపులకు పార్టీ క్యాడర్ స్పందించి అంచెలంచెలుగా నియోజకవర్గం పరిధిలో పార్టీని బలోపేతం చేసినందుకు క్యాడర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అపోహలు నమ్మవద్దు: జనసేన ఏలూరు నియోజకవర్గ అభ్యర్థిని కొనేసామని, ఆయన పొత్తులో ఉన్న అభ్యర్థికి అమ్ముడుపోయారని, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి ప్రచారాలను నమ్మవద్దని పార్టీ క్యాడర్ కు ఉద్ఘాటించారు. 2024 ఎన్నికలలో ఏలూరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ పోటీ చేస్తుందని, ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావు లేదని క్యాడర్ కు సూచించారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, జనసేన జిల్లా కార్యదర్శి కస్తూరి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలి శెట్టి శ్రావణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, టౌన్ కమిటీసభ్యులు ప్రసాద్, బుద్ధ నాగేశ్వరావు, వల్లూరు రమేష్, ఎటించి ధర్మేంద్ర, కృష్ణ, దోసపత్తి రాజు, విజేయ్, చరణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కోల శివ, చిత్తిరి శివ, నాయకులు వీరంకిపండు, రెడ్డి గౌరీ శంకర్, భోండ రాము, నిమ్మల శీను, భోద్దపు గోవిందు తదితరులు పాల్గొన్నారు.