ఈసారి కలిసి రాబోతున్న అల్లూరి – భీం లు

దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్‌ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు టీజర్ లు వచ్చాయి. భీం, అల్లూరి ఇద్దరికీ సంబందించిన టీజర్లు వచ్చి ఆకట్టుకోకగా..ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే టీజర్ లో రాబోతున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ టీజర్ రాబోతున్నట్లు  వినికిడి. ఇద్దరు వేరు వేరు గా వస్తూనే యూట్యూబ్ షేక్ అయ్యింది. ఇక ఇప్పుడు ఇద్దరు ఒకే టీజర్ లో వస్తే ఏమవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *