పవన్27వ సినిమా షూటింగ్.. ఫోటోలు లీక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చేసినా తర్వాత వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. మూడేళ్ల గ్యాప్ ఇచ్చిన పవన్ రీఎంట్రీ తర్వాత మొదటగా పింక్ రీమేక్ మూవీ ‘వకీల్ సాబ్’ లో నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్ కు సిద్దమైంది. ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ కూడా నటించనుందని తెలుస్తోంది. ఇది పవన్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి పవన్ పిక్స్ లీక్ అయ్యాయి. ఈ ఫొటోలో పవన్ పీరియాడికల్ లుక్ లో కనిపిస్తుండగా.. ఈ సినిమా మొగలాయిలా కాలంనాటి కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. మహాశివరాతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది.