వీరమహిళల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి

గుంటూరు, స్వతంత్ర సమరయోధులు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ వీరమహిళలు నాజ్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి మాట్లాడుతూ అణగారిన ఆదివాసీల సంక్షేమం కోసం, అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గ, రాజనాల నాగలక్ష్మి, మల్లేశ్వరి, ఆసియా, మాధవి, అరుణ, ప్రియారాణి తదితరులు పాల్గొన్నారు.