వల్లూరు జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఆచంట నియోజకవర్గం, వల్లూరు గ్రామంలో భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ గారి 131 జయంతి ని పురస్కరించుకొని వల్లూరు మార్కెట్ సెంటర్ లో ఉన్న భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహనికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ శ్రీమతి నెలపూడి బేబీ రామ్ మోహన్, జనసేన పార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, జనసేన నాయకులు తోట ఆదినారాయణ (తాతాజీ ), తోట సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.