సౌమిత్ర ఛటర్జీ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన అమితాబ్

ప్రముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ(85) ఆదివారం కరోనాతో కన్నుమూశారు. నెలరోజులుగా కోల్‌కతాలోని బెల్లే వ్యూ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ఈ లెజండరీ నటుడికి  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా సౌమిత్ర ఛటర్జీ మృతికి సంతాపం తెలియజేస్తూ… సౌమిత్రా ఛటర్జీ ..గొప్ప లెజెండ్ .. సినీ పరిశ్రమలో మరో శిఖరం ఒరిగింది. మంచి మనసు అద్భుతమైన ప్రతిభ ఉన్న సౌమిత్ర ఛటర్జీని చివరిగా కోల్‌కతాలోని ఐఎఫ్‌ఎఫ్‌ఐలో కలిసాను అంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. సౌమిత్ర ఛటర్జీ మృతిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సంతాపం తెలియజేశారు. ఆయన అంత్యక్రియలలోను పాల్గొన్నారు.