పేకాటకు అడ్డాగా హీరో నాగ శౌర్య ఫామ్ హౌజ్.. సమాచారం మేరకు ప్రముఖుల అరెస్ట్ ?

యంగ్ హీరో నాగ శౌర్య గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే నాగ శౌర్య ఫామ్ హౌజ్ ఇప్పుడు ప్రముఖుల పేకాటకు అడ్డాగా మారిపోయింది. కాగా పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులకు కొంతమంది ప్రముఖులు దొరికినట్లు తెలుస్తోంది.  పట్టుబడ్డ వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజారామ్ (వాసవి డెవలపర్స్ గ్రూప్.) , మద్దుల ప్రకాష్ (రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి) ఉన్నారు.

కాగా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. అక్కడ పేకాట నిర్వహిస్తున్న గుప్తా సుమన్ కుమార్ ఫోన్ ని సీజ్ చేసిన పోలీసులు నాగ శౌర్య కు సుమన్ కు మధ్య సంభాషణ లపై విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు కూడా తెరపైకి రావడం చాలా అనుమానాలకు దారి తీస్తోంది.