అగ్నిప్రమాద కుటుంబాలకు గ్యాస్ స్టవ్ అందజేసిన అమ్మిశెట్టి వాసు

వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపోయిన నిరుపేద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందారని జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆరోపించారు. 19వ డివిజన్ లో అగ్నిప్రమాదం జరిగి సర్వస్వం కోల్పోయిన బాధితులకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయిన 17 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి జనసేన తరుపున గ్యాస్ పోయ్యిలను అందించామని స్పష్టం చేశారు. పేదలు ఉండే ఫకీరు గూడెం ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమని తెలిపారు.సుమారు 17 ఇల్లు పూర్తిగా దగ్దమయ్యాయని, కట్టుబట్టలతో వారు నిరాశ్రయులయ్యారని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందిచలేదని కనీసం సాయం కూడా చేయలేదని విమర్శించారు. వరదలు, ఇలాంటి అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకోవడం లేదని, ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ప్రభుత్వం బాధితులకు టిడ్కో ఇల్లు, లక్ష రూపాయలు ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పోతిరెడ్డి అనిత, ప్రోగ్రాం కమిటి జాయింట్ సెక్రటరీ ఫణి వంశీ, 19వ డివిజన్ అద్యక్షులు హరి ప్రసాద్, డివిజన్ నాయకులు యుగంధర్, గోపి, 21వ డివిజన్ ప్రెసిడెంట్ పోతిరెడ్డి రమణ, 16వ డివిజన్ ప్రెసిడెంట్ చందు శివరామకృష్ణ, 8 వ డివిజన్ ప్రెసిడెంట్ వివేక్ 19వ డివిజన్ నాయకులు కమ్మిలి రమణ వేణు బి తిరుమలరావు కె వెంకటేశ్వరరావు, ఎం వినయ్ కుమార్, ఫణి తదితరులు పాల్గొన్నారు.