అధినేత కోసం ఒక సైన్యమే సిద్ధంగా ఉండాలి: డా.వంపురు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో పాడేరు నియోజకవర్గంలో గల జి.మాడుగుల, పాడేరు మండలాల ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన సుపారి ప్రణాళికలు రచించిన వారిపై తక్షణమే దర్యాప్తు చేసి ఈ విద్రోహ చర్యలకు ప్రధాన కారకులెవరనేది తేల్చాలని, సుపారి హత్యరాజకీయలకు, ఫ్యాక్షన్, రాజకీయాలకు అలవాటు పడిన నేతలెవరో త్వరలోనే తెలియజేయాలని వారిని జనసేన పార్టీ, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు వదలరని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య తెలిపారు. జి.మాడుగుల మండల జనసేన అధ్యక్షులు మసాడి భీమన్న మాట్లాడుతూ నీతి, నిజాయితీతో రాజకీయాలు చేసే మా నాయకుడిని ఎదుర్కోలేక కేవలం వ్యక్తి గత విమర్శలు చేస్తూ ఇంకెంత కాలం ప్రజల్ని మభ్యపెడతారు. అంతటితో చాలక ఇప్పుడు సుపారి రాజకీయాలు చేస్తారా? ఇదేనా మీరు ప్రజాస్వామ్యనికి మీరిచ్చే విలువ? అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రధాన కార్యదర్శి గొంది మురళి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని తిట్టారు భరించాము, కుటుంబంలో స్త్రీ మూర్తులను అవహేళన చేస్తూ అసభ్యంగా మాట్లాడారు సహించాము. ఇంకా బరితెగించి సుపారి రాజకీయాలు చేసే వారెవరైనా వారికి మేము ఒకటే చెప్తున్నాం… మా అధినేతకు ఏదైనా జరిగితే రాష్ట్రం అట్టుడికిపోవడం ఖాయం మీరు ఎవరైనా కావచ్చు కొన్ని కోట్ల మంది జనసైనికులు మీ అంతు చూడటానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం గుర్తుంచుకోండి మీ దహనానికి బూడిదకూడా మిగల్చరు ? దయచేసి పిచ్చి చేష్టలతో దిగజారుడు రాజకీయలు చెయ్యొద్దు. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. వెరసి ఈ దేశానికే మంచిది కాదు? ఆ మాటకొస్తే మా పాడేరు నియోజకవర్గంలో నుంచి కూడా మా అధినేతను కాపాడుకోవడానికి సిద్ధమై ఉన్నా జనసైనికులు లక్షల్లో తరలి వెళ్లి మా అధినేతకు భద్రతనిస్తాం అంటూ తెలిపారు. పాడేరు మండల జనసేన అధ్యక్షులు మురళికృష్ణ మాట్లాడుతూ మా అధినేతను టచ్ చేస్తే రాష్ట్రం తగలబడిపోవడం ఖాయం. ఈ కుట్ర వెనకాల వాస్తవాలు త్వరలోనే తెలియజేయాలి. లేదంటే జనసైనికులు మీ అంతు చూసే రోజులు దగ్గరపడ్డాయంటూ హెచ్చరించారు. ఈ సమావేశంలో కొత్తగా చేరిన జనసైనికులతో పాటుగా వివిధ మండల స్థాయి నాయకులు కలిసి సమావేశమవుతూ ఏ క్షణమైనా ఏమి జరిగిన డా.వంపురు గంగులయ్య ఆధ్వర్యమున అధినేత కోసం ఒక సైన్యమే సిద్ధంగా ఉండాలంటూ తీర్మానించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, ప్రధాన కార్యదర్శి గొంది మురళి, పాడేరు మండల నాయకులు రమేష్ నాయుడు, మజ్జి సత్యనారాయణ, జంగిడే ఈశ్వరరావు, బాలకృష్ణ, సాలేబు అశోక్, కిల్లో అశోక్ కుమార్ అశేష సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.