అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో వై.సి.పి నేతలపై జనసేన వినూత్న నిరసన

  • పవన్ ను ప్యాకేజీ స్టార్ అన్న పలువురు మంత్రులు చిత్ర పటాలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపిన జనసేన నేతలు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, ఇతర నాయకులు
  • బూతుల మంత్రులు మనసు మార్చాలని, సద్బుద్ది కలిగించాలని కోరుతూ కార్యక్రమం చేపట్టామన్న అమ్మిశెట్టి వాసు

అవనిగడ్డ: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అన్న పలువురు మంత్రుల చిత్ర పటాలను భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేసారు. ఈ నిరసనలో భాగంగా జనసేన నేతలు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, ఇతర నాయకులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న చెత్తను భోగి మంటల్లో వేసి ఇంటిని క్లీన్ చేస్తాం, అదే విధంగా మంత్రుల మైండ్ లో ఉన్న చెడును తొలగించి మంచి మనసు, ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నాం. జోగి రమేష్ ఒక సన్నాసి… వాడు ఎక్కడి నుంచి ఎలా ఎదిగాడో అందరికీ తెలుసు. నీ ముఖానికి పవన్ కళ్యాణ్ ఎందుకు.. దమ్ముంటే మాతో చర్చకు రా.. ప్రజలకు సేవ చేయడం చేతకాని మంత్రుల్లో అమర్ నాధ్ ఉంటాడు. ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు అని కూసే వెధవలకు నిరూపించే దమ్ముందా..?. అంబటి రాంబాబు అచ్చోసిన ఆంబోతులా వాగుతున్నాడు. మొన్నటి వరకు నల్ల రంగు పూసుకుని… గుడిసేటు వేషాలు వేశావు. నువ్వు ఎవరెవరితో ఏం మాట్లాడావో ఫోన్ కాల్స్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు రంగు తీసి తెల్ల జుట్టుతో మాట్లాడితే పెద్ద మనిషివి అయిపోవు. పేర్ని నాని..‌. నువ్వు కాపు జాతిలో‌చెడ పుట్టావు. నీకు మంత్రి పదవి పోయాక… నీ మతి గతి తప్పింది. పవన్ కళ్యాణ్ ప్రశ్నలు జు సమాధానం చెప్పే దమ్ము మీకు లేదు, అందుకే తాడేపల్లి ప్యాలెస్ లో ప్యాకేజీ లు తీసుకుని ఏదేదో వాగుతావు. కాపు జాతిని మీ స్వార్ధం కోసం జగన్ కు తాకట్టు పెట్టారు. మీరంతా దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. మీరు, మీ జగన్ ఏం చేశాడో చెప్పండి. మీరు హామీలు అమలు చేయకుండా ఎలా మోసం చేశారో మేము చెబుతాం. మీకు సిగ్గు, శరం లేదు కాబట్టే బూతులు తిడుతూ భయంతో బతుకుతున్నారు. మా అమ్మ, నాన్న, మా నాయకుడు మాకు సంస్కారం నేర్పారు. అందుకే తిట్టకుండా పద్దతిగా మాట్లాడుతున్నాం. మీరు మారకపోతే…. రేపు ప్రజలే మిమ్మలను మార్చి ఇంటికి పంపుతారు. పవన్ కళ్యాణ్ అన్ని కులాల ఐక్యత, అభివృద్ధి కోసం కష్ట పడుతున్నారు. ఆయన పై కాపుల ముద్ర వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. వైసిపి లో కాపు నేతలకు కులాభిమానం ఉంటే కాపులకు ఏం చేశారో చెప్పండ్రా. ప్రజలకు పంచి పెట్టే నిస్వార్ధ నాయకుడి వద్ద మేమున్నాం. ప్రజల సొమ్మును దోచుకున్న వాళ్ల దగ్గర మీరు ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేసారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అమరావతి అధికార ప్రతినిధి మండలి రాజేష్, డివిజన్ అధ్యక్షులు రామాయణపు కోటి, గాదిరెడ్డి అమ్ములు, హరిప్రసాద్, దోమకొండ అశోక్, యడ్లపల్లి నాగరాజు, చందు శివ రామకృష్ణ, ముత్యాల కృష్ణ, పార్ష శ్రీనాధ్, గుంటుపల్లి సుజాత, మరియు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.