జనసేనానిపై రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలకు జనసైనికులు ఫైర్

పలమనేరు: పలమనేరు నియోజకవర్గం జిల్లా పోగ్రామ్ కమిటీ మెంబర్ సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలుపుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద చెత్తవాగుడు వాగుతున్న చెత్తమనుషులను ఓటు అనే భోగి మంటలో వేసి రాష్ట్రాన్ని పరిశుద్ది చేయాలన్నారు. అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజులను ఉద్దేశించి మీకు మంత్రి పదవులు ఇచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తప్ప పవన్ ను టార్గెట్ చేయడానికి కాదన్నారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలతో మంత్రులపై విరుచుకుపడ్డారు.. కార్యక్రమంలో జనసేన మండల నాయకులు హార్శ, అనిల్, విజయ్, సునీల్, కిషోర్ పాల్గొన్నారు.