శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు ఓపెన్ ఛాలెంజ్

శ్రీకాళహస్తి నియోజకవర్గం: ఇళ్ళ నిర్మాణాల్లో అవకతవకలు ఉంటే నిరూపించాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ స్వీకరించి మోసాన్ని నిరూపిస్తామనిఆదివారం చర్చకు సిద్ధం అని శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా చెప్పరు. దమ్ముగా ఛాలెంజ్ ను ఎదుర్కోలేక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దొడ్డి దారిన పోలీసులను అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఛాలెంజ్ కి రాకుండా ఆపాలని ప్రయత్నించడం ఎమ్మెల్యే అసమర్థతకు, అధైర్యానికి నిదర్శనం. ఛాలెంజ్ ఎదుర్కోవడానికి దమ్ము, ధైర్యం లేనపుడు విసరడం ఎందుకు. రాష్ట్రంలో సెక్షన్ 30 యాక్ట్ కేవలం జనసేన పార్టీ కి మాత్రమేనా అని వినుత కోటా ప్రశ్నించారు.