పదవ తరగతి ఉత్తీర్ణులను అభినందించిన ఇంటిపల్లి ఆనందరాజు

రాజోలు మండలం: మండల పరిధిలోని రాజోలు బాలికల జడ్పీ పాఠశాలకు చెందిన పదవ తరగతి పరీక్షల్లో 584 మార్కులు సాధించిన ఆకుల అంజని దుర్గపూర్ణిమను ఆదివారం రాజోలు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు ఇంటిపల్లి ఆనందరాజు అభినందించారు. అదేవిధంగా చింతలపల్లి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు ఉత్తమ మార్కులు సాధించిన కొండ నాగలక్ష్మి మనిస్వని, కూనవరం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు ఉత్తమ మార్కులు సాధించిన ముల్లికపల్లి గ్రామంనకు చెందిన దొమ్మేటి సత్య శ్రీ నీ ఇంటిపల్లి ఆనందరాజు మరియు జనసేన నాయకులు ఉత్తీర్ణులైన వారి ఇంటికి వెళ్లి మరీ విద్యార్థిలును ప్రత్యేకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజుతో పాటు జనసేన నాయకులు పిప్పల లక్ష్మణరావు, జనసేనవీరమహిళ ఉలిశెట్టి అన్నపూర్ణ, పలువురు మహిళలు, నాయకులు పాల్గొన్నారు.