అనంతగిరి జనసేన మండల కమిటీ సమావేశం

అరకు, జనసేన పార్టీ బలోపేతంతో పాటు సమస్యలు తెలుసుకోవటం కోసం అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో ఉన్న
గ్రామాల పర్యటనలకు అరకు జనసేన పార్టీ కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా అనంతగిరి మండల నాయకులతో అరకు జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంచార్జ్ చెట్టి చిరంజీవి సమావేశం పాల్గోని మండల నాయకులకు తగు సలహాలు సూచనలు అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి, కూర రమేష్, దూరు అఖిల్ కుమార్, బోయిన సుదాకర్, పోడెల బుజ్జిబాబు, జర్రా సుబ్బారావు, వీర మహిళ రత్నాప్రియ పాల్గొనడం జరిగింది.