శవ రాజకీయాలు చేయడం మానుకో జగన్ – బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విచ్చిన్నం చేసిన జగన్ శవ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. తాడేపల్లిగూడెం మండలం, మాధవరం లో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీలతో కలిసి శనివారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు నెలలుగా రాజకీయం లబ్ధి కోసం జగన్ వృద్ధుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలను పక్కదారి పట్టించి తన మాట వినే అధికారులతో పింఛన్ల పంపిణీలో జాప్యం చేస్తూ వృద్ధుల ప్రాణాలు తీస్తున్నారు అన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని మే 13న జగన్కు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి గా ఉన్న నాకు గ్లాసు గుర్తుకు, ఎంపీ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ వర్మ కు కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ గ్రామానికి ఏమి ఇచ్చుకున్నా రుణం తీర్చుకోలేమని దేశ రక్షణలో పునీతులైన ప్రజలకు సేవ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ గ్రామంలో 3,000 మంది మాజీ సైనిక్ ఉద్యోగులు సైనికులు ఉన్నారని వారికి మిలటరీ కాంటీన్ ఏర్పాటుకు కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ గారి స్వయంగా హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. టిడిపి నియోజవర్గం ఇంచార్జ్ వలవల బాబ్జి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రోడ్లన్నింటినీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వేయిస్తామని, ఎర్రకాలువ అభివృద్ధి వంతెనని ఏర్పాటు కూడా తామే బాధ్యత తీసుకుంటామన్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి తమ బాధ్యత అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అడుగడుగునా గ్రామంలోని టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళలు ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలుకుతూ.. హారతులు ఇస్తూ బ్రహ్మరథం పట్టారు.