నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సాయమందించిన అనపర్తి జనసేన

అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలంలో రామవరం గ్రామంలో దళిత వాడలో ఇటీవల అకాలంగా వేసిన భారీ గాలి వల్ల ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో, చింతపల్లి అప్పారావుది నిరుపేద కుటుంబం కావడంతో ఈ విషయం తెలిసిన జనసేన పార్టీ ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ జనసైనికులు 10000 రూపాయలు సహకారం చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రామారావు, అనపర్తి నియోజకవర్గ జనసైనికులు సోమశేఖర్, నాగిరెడ్డి రామిరెడ్డి, అమీర్, చంటి, బుల్లయ్య, రాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.