చిత్రావతి నీరు కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టండి: పుట్టపర్తి జనసేన

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం, పుట్టపర్తిలోని డ్రైనేజీకి సంబంధించిన నీరు దాదాపు 18-22 లక్షల లీటర్ల నీరు పూర్తిగా చిత్రావతి నది మరియు బుక్కపట్నం చెరువు.. ఏదైతే బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తికి మధ్యలో ఉన్న చెరువు. ఈ మూడు మండలాలకు మంచి నీటి సౌకర్యానికి కేంద్ర బిందువు అయిన చెరువులోకి ఈ డ్రైనేజీ నీరు పూర్తిగా ఇందులోకి కలవడం జరుగుతుంది. దాదాపుగా ఎనిమిది నెలల నుంచి పూర్తిగా పుట్టపర్తిలో ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఉందో ప్రతి ఒక్క బిందువు బుక్కపట్నం చెరువులోకే కలిసి మొత్తం చెరువు అంతా కలుషితం అవుతుంది. దీని వల్ల ఈ చెరువులో ఉన్న రోగాలు వ్యాపించిన చేపలను ప్రజలు తినడం వలన చర్మ రోగాలు మరియు ప్రాణాంత కరమైన క్యాన్సర్ అనే వ్యాధి కూడా వ్యాప్తి చెందుతుంది. ఇది వరకే క్యాన్సర్ వ్యాధితో చాలామంది చనిపోవడం చూస్తూనే ఉన్నాం, ఆ తరువాత ఈ మధ్యనే విషజ్వరాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఈ పుట్టపర్తికి చెందిన డ్రైనేజీ నీరు చెరువులోకి కానీ, చిత్రావతి నదిలో కలవకుండా చెరువు మరియు చిత్రావతి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి అని పుట్టపర్తి జనసేన పార్టీ తరుపున సత్యసాయి జిల్లా కలెక్టర్ కి మరియు పుట్టపర్తి మునిసిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు, డాక్టర్ పల్లపు తిరుపతేంద్ర, పుట్టపర్తి మండల అధ్యక్షుడు బోయ పెద్దన్న, వెంకటేష్ నాయక్, ఆర్.కే.సీ మారుతి, సూరి రాయల్, మనప్పురం చంద్ర, శ్యామ్ రాయల్, బోయ వంశీ, మేకల పవన్ కళ్యాణ్, అంజి, చిగిచెర్ల గణేష్, నారాయణ స్వామి, శ్రీనివాస్, రామంజి, శివ, వేణు, పునకాంత్, సాయి ప్రభ తదితరులు పాల్గొన్నారు.