తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ .. ప్రదీప్

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు తన యూ ట్యూబ్ చానెల్ ద్వారా స్పందించాడు. ఇటీవల ఓ యువతి తనపై వివిధ వర్గాలకు చెందిన 139 మంది వ్యక్తులు గత కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిoది. ప్రస్తుతం ఈ కేసును సీసీఎస్ పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ఈ కేసులో యాంకర్ ప్రదీప్‌ను కూడా యువతి నిందితుడిగా పేర్కొంది. ఈ నేపద్యం లో ప్రదీప్ నిజానిజాలు తెలుసుకోకుండా వాళ్లకు వాళ్లే నిర్దారణ చేసుకొని తనపై ఆరోపణలు చేస్తూ, తన పేరు, ఫొటోలను వాడుకొని కథనాలు రాస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిపై మండిపడ్డాడు. నిజం ఎంటో తెలుసుకోకుండా, తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేస్తూ తనని మానసికంగా మానభంగం చేస్తున్నారని, ఆ తప్పుడు వార్తలు చూసి తను కాని తన ఇంట్లో వాళ్లకి కాని ఏదైన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రదీప్ ఆవేదన వ్యక్తంచేశాడు.

ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది అని మొత్తం అన్ని ఆధారాలతో బయటకి తీస్తా అని, ఆ నిజం ఎంటో తెలియకముందే సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న కొన్ని న్యూస్ సైట్స్, యూ ట్యూబ్ చానెల్స్‌పై కూడా చట్టపరమైన చర్యలు  తీసుకుంటానని  యాంకర్ ప్రదీప్ మాచిరాజు హెచ్చరించాడు.