వైసిపి కబంధహస్తాల నుండి ఆంధ్రప్రదేశ్ ని కాపాడాలి: బొలిశెట్టి శ్రీనివాస్

బొలిశెట్టి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన యూఏఈ జనసేన సభ్యులు

యూఏఈ దుబాయ్: జనసేన నాయకులు తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వ్యక్తిగత దుబాయ్ పర్యటన సందర్భంగా యూఏఈ జనసేన సభ్యులు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే 2024 ఎలక్షన్స్ లో ఆయన విజయానికి యూఏఈ జనసేన ఆయనతో కలిసి నియోజకవర్గంలో పర్యటించి ఆయన విజయానికి దోహదపడేలా కలిసి పని చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ యుఏఈ జనసేన జనసైనికులను కలవటం చాలా సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాక్షస రాజ్యాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పనిచేసి, ఆంధ్రప్రదేశ్ ని ఈ వైఎస్ఆర్సిపి కబంధహస్తాల నుండి కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూఏఈ జనసేన సభ్యులు 2024 ఎన్నికల సందర్భంగా యూఏఈ జనసేన జనసేన పార్టీ విజయానికి అన్ని విధాలా నిలబడుతుందని దానికి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని శ్రీనివాస్ గారికి తెలియజేశారు. ఈ సందర్భంగా యూఏఈ జనసేన నుండి పాపోలు అప్పారావు, మొయిదా అప్పాజీ, ముని కుమార్, సత్య మాలే, బాలాజీ, సుబ్బారావు, వెంకట్ అడ్డాల మొదలైన జనసైనికులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూఏఈ జనసేన సభ్యులందరూ ఆంధ్రప్రదేశ్ లోని రాక్షస పాలనను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్న బొలిశెట్టి శ్రీనివాస్ ను అభినందించారు.