అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చెయ్యాలని జనసేన డిమాండ్

గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు పట్టణంలోని 21వ వార్డ్ అంతోనీ స్ట్రీట్, మండి బజార్ నందు బాలింతలు, చిన్న పిల్లలు(6 నెలల నుండి 3 సం చిన్నారులు), గర్భిణీ స్త్రీలు సుమారు 12మంది స్థానికంగా అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో 17వ వార్డ్ కు సంబందించిన అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది. దిని వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 17వ వార్డ్ నందు సుమారు 3 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, వాటిలో నుంచి ఒక్కటి 21వ వార్డ్ లోకి మార్చాలి, లేనియెడల నూతనంగా కొత్త అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చెయ్యాలి అని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో సంబందిత అధికారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, గుంతకల్లు నియోజకవర్గం జనసేన నాయకులు మరుతీ కుమార్ యాదవ్, జనసేన కార్యకర్తలు విజయ్, భరత్, అరవింద్, ప్రకాశ్, మహీంద్ర, హారి, శివ కుమార్, భాస్కర్ మరియు తదితరులు పాల్గొన్నారు.