WHO ఫౌండేషన్‌ సీఈవోగా అనిల్‌ సోని నియామకం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఫౌండేషన్‌ సీఈవోగా భారత సంతతికి చెందిన అనిల్‌ సోని నియామకమయ్యారు. వచ్చే జనవరి 1 న డబ్ల్యూహెచ్‌ఓ ఫౌండేషన్ ప్రారంభ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సోని తన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతకు ముందు గ్లోబర్‌ హెల్త్‌ కేటర్‌ కంపెనీ వట్రియాస్‌లో గ్లోబల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగానికి హెడ్‌గా కొనసాగారు. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో వైద్యారోగ్య సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు లాభాపేక్ష లేని రంగాల్లో 20 ఏళ్ల పాటు సేవలందించారు.