సినీ పరిశ్రమకు పెద్దగా ఉండాలని అన్నయ్యకు ఎప్పటికీ లేదు: నాగబాబు

తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా ఉండాలని తన అన్నయ్య చిరంజీవి ఎప్పుడూ అనుకోలేదని, ఆ ఆలోచనే ఆయనకు లేదని నాగబాబు పేర్కొన్నారు. ఎవరైనా కష్టమంటూ తమ గడప తొక్కితే ఎంతో కొంత సహాయం చేసే వ్యక్తి తన అన్నయ్య అని, అంతే కానీ పెద్ద రాయుడిలా సింహానంపై కూర్చోని పెత్తనం చెలాయించాలనే ఆలోచన తన అన్నయ్యకు లేదన్నారు. మా ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలు లాగే సాగాయని, కులం, ప్రాంతీయవాదం కూడా పని చేశాయని, అందుకనే ఇంతటి సంకుచిత సంస్థలో తను ఉండలేకే రాజీనామా చేశానని చెప్పారు. తాను ఎప్పటికీ మా లో కొనసాగేది లేదని అన్నారు. మరో ఆర్టిస్టిల సంఘాన్ని నెలకొల్పాలనే ఆలోచన తమ కుటుంబానికి లేదని అన్నారు.