ఏజెన్సీలో మరో కుంభకోణం

  • నిరుద్యోగయువతను ఆసరాగా చేసుకుని ఏజెన్సీలో మరో కుంభకోణం
  • వందలాది నిరుద్యోగ ఆశావాహ ఉపాధ్యాయ అభ్యర్థులను ఏడాదిగా పని చేయించుకుని జీతాలు ఇవ్వని పరిస్థితి

పాడేరు: నిరుద్యోగయువతను ఆసరాగా చేసుకుని ఏజెన్సీలో మరో కుంభకోణానికి తెర తీశారని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్ డా. వంపూరు గంగులయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన పాడేరు జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆదాని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ పేరుతో మధ్యవర్తుల ద్వారా ఉపాధ్యాయ అశావహ అభ్యర్థుల నియామకం జరిగింది. విద్యాంజలి 2.0 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, అదాని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 2022 – 2025 పేరిట అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. దాని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ప్రతి జిల్లాకి ఒక కోఆర్డినేటర్ ని నియమించి వారికి జీతాలు చెల్లించే ప్రక్రియను ఈ అదాని సంస్థే ప్రారంభించింది. ఈ నియామకాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ పేరు మీద జరగడం విశేషం. ప్రవీణ్ ప్రకాష్ పేరు మీదే ప్రత్యేకంగా దేనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఆ రిక్రూట్మెంట్ సమయంలో 2/1 / 2023 రిలీజ్ చేయడం జరిగింది. 28.09.2022 తేదీన అఫ్ ది ఎస్.డి.పి సమగ్ర శిక్ష ఏపీ అమరావతి పేరిట ఆఫీస్ ప్రొసీడింగ్స్ ఆర్ సి నెంబర్.406/ఏ4/2021 29.09.2022 ఈ నియామకాలు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తుంది. గురువారంతో ఈ నియామకాలు జరిగి సంవత్సరం పూర్తవుతుంది. 2022 నవంబర్ 25వ తేదీన అనిత అగర్వాల్ మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ పేరుతో విద్యాంజలి 2.0 ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రోగ్రాం కి ప్రత్యేకంగా ఒక ఆర్డర్ ని కూడా ఇష్యూ జారీచేశారు. కెరీర్ గైడెన్స్, చిన్నారులకు విద్య, సబ్జెక్టులో సహాయం అందించడం, వృత్తి విద్యలు నేర్పించడం, యోగ ఆసనాలు చేపించడం, క్రీడలు, డిజిల్ ఎడ్యుకేషన్ కల్పించడమే లక్ష్యంగా అదాని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాంజలి 2.0 పేరిట నియామకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా అదాని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉందో అక్కడ ఈ సంస్థ ఆధ్వర్యంలో కొంత మొత్తంలో జీతాలు చెల్లించి ఎడ్యుకేషన్ పరంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో ఆ స్వచ్ఛంద సంస్థతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ప్రధానమంత్రి స్వయంగా విద్యాంజలి 2.0 ఎన్జీవోను లాంచ్ చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అమలు జరుగుతా ఉంది. ప్రతి చోట పరిస్థితి ఎలా ఉందని తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఆ పేరిట నియామకాలు చేసిన వారికి ఏడాదిగా జీతాలు ఇవ్వడం లేదు. ఇందులో ప్రధానంగా డిజిటల్ ఎక్విప్మెంట్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రొవైడ్ చేయాలని ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రైవేటు – ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ బడుల్లో విద్య బలోపేతం చేసే లక్ష్యంతో దీని ఏర్పాటు చేశారు. విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విద్యాంజలి 2.0 నియామకాల సక్రమంగానే జరిగాయి కానీ దానికి సంబంధించినటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా నియామకాల జరిపినటువంటి వ్యక్తులు వారి డబ్బుల్ని తినేశారు. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాలంటీర్ గా విద్యా వ్యవస్థ బలోపేతానికి తమ కృషి చేస్తామని ఎవరైనా వస్తే కచ్చితంగా నియామకాలు చేసుకునేందుకు విద్యాశాఖ ముందుకు వస్తుంది. దానిలో భాగంగానే హెచ్ఎం లందరూ కూడా యూపీ స్కూల్, హై స్కూల్స్లో ఈ విద్యాంజలి 2.0 పేరట వచ్చినటువంటి వాలంటీర్లు అందరిని కూడా విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఆరోజు చాలా స్పష్టంగా జీతాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, కంప్యూటర్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఆదాని ఎడ్యుకేషనల్ – సంస్థ ప్రొవైడ్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే హెచ్ఎం లందరూ కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. అయితే ఇది డీఈఓ కు తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ గారి పేరిటే ఈ ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. పోలీసులు ఇప్పుడు హెచ్ఎం ల బాధ్యులు చేయడం సరికాదు. ఎవరైతే నియామకాలు జరిపారో వాళ్ళని స్టేషన్ బెయిలు పై వదిలేసి సంబంధం లేని వ్యక్తులు స్టేషన్ కి పంపించి భయభ్రాంతులకు గురి చేయడమనేది సరికాదు. దాంతో పాటు స్కూల్స్ విలీనం అయిన తర్వాత ఉపాధ్యాయులకు తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఉంది. దాన్ని అధిగమించే క్రమంలోనే ఇబ్బందులు పడతా ఉంటే పోలీసులు ప్రత్యేకంగా వీటికి సంబంధించిన కేసుల బలాయించాలని ప్రయత్నం చేయడం సరికాదు. ఇప్పుడు దీంట్లో అదాని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ సంస్థలో నియామకాలు జరిగినటువంటి రాష్ట్ర కేంద్ర స్థాయిలో ప్రధాన సూత్రధారులు ఎవరున్నారు? ముందు వారిని బయటకు తీయాలి.. వీరందరికీ జీతాలు వచ్చేలా ఏర్పాటు చేయాలి? లేదనుకుంటే దీనిపై న్యాయపోరాటానికి వెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్ డా. వంపూరు గంగులయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు కిటలంగి పద్మ, బొనుకుల దివ్యలత, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, పాడేరు మండల ఉపాధ్యక్షులు సీసాల్ భూపాల్, కార్యనిర్వహన కమిటీ సభ్యులు సురేష్, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్ కుమార్, మాదేల నాగేశ్వరరావు, కించేయి ప్రసాద్, సత్తిబాబు తదితరులు బాధితులు పాల్గొన్నారు.