పాయల్ ఘోష్ కేసులో అనురాగ్ కశ్యప్ ట్విస్ట్

ఊసరవెల్లి సినిమాలో నటించిన పాయల్ ఘోష్ కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న విషయం తెల్సిందే. ఆమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ పై దారుణమైన కామెంట్స్ ను చేసింది. ఆ దర్శకుడు తనను రేప్ చేయడానికి ప్రయత్నించడంటూ ఏకంగా ప్రధానమంత్రి మోదీకే ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇవే ఆరోపణలపై ఆమె మహారాష్ట్ర గవర్నర్ ను కూడా కలిసింది. 2013 ఆగస్ట్ లో ముంబైలో అనురాగ్ స్వస్థలంలో తన రేప్ ప్రయత్నం జరిగిందని పాయల్ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఈ విషయంపై పలువురు రాజకీయ నాయకులు పాయల్ కు సపోర్ట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అనురాగ్ ను నిన్న పోలీసులు విచారించారు. తాజాగా ఈరోజు ఆయన ఒక స్టేట్మెంట్ ను విడుదల చేశారు. తనపై పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని అన్నారు. మీటూ ఉద్యమాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయాలనుకుంటున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

అనురాగ్ తరపున ఈ కేసును చూసుకుంటున్న లాయర్ ప్రియాంక ఖిమానీ మాట్లాడుతూ… విచారణ సందర్భంగా కశ్యప్ ఒక డాక్యుమెంటరీ ఆధారాన్ని అందించారని చెప్పారు. 2013 ఆగస్ట్ మాసం మొత్తం ఒక సినిమా షూటింగ్ కోసం శ్రీలంకలోనే ఉన్నట్టు ఆధారాలు ఇచ్చారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను కశ్యప్ ఖండించారని చెప్పారు. కశ్యప్ ఇమేజీని డ్యామేజ్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేశారని అన్నారు. ఈ స్టేట్మెంట్ పై పాయల్ ఘోష్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.