వికలాంగులను మోసం చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి – జనసేన

గుడ్లూరు :- 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత సీఎం అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే వికలాంగుల వైకల్యం 40 శాతం ఎక్కువ ఉన్నవారికి సదరన్ సర్టిఫికెట్ ద్వారా వికలాంగులకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి గెలిచి మూడు సంవత్సరములు అయినా పింఛన్లు మంజూరు కాలేదు. గుడ్లూరు శివాలయం సంఘంలో నివాసం ఉంటున్న ఎస్టి కులానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తికి ఆటో ప్రమాదంలో కుడికాలు తీసివేయడం జరిగింది. ఈ ప్రమాదం జరిగే రెండు సంవత్సరములు అయినా అధికార నాయకులు పంచాయతీ అధికారులు వాలంటరీ వ్యవస్థ సహకరించలేదని పంచాయతీ అధికారులకు చెప్పిన ఫలితం లేదని తనకు ఉపాధి లేదని అవస్థలు పడుతున్నాడని అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అందకపోవడం పాతబడిన ఇల్లు విద్యుత్ మీటర్ లేకపోవడం చీకటిలో ఉంటున్నామని కనీసం వంట చేసుకోవడానికి గ్యాస్ కూడా లేదని కుటుంబ సభ్యులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మండల జనసేన నాయకుడు అన్నంగి చలపతి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వీడియో ద్వారా చెప్పడం జరిగింది. గడపగడపకు తిరుగుతున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరియు అధికార నాయకులకు పంచాయతీ సిబ్బందికి ఈ సమస్యలు కంటికి కనిపించడం లేదా ఇకనైనా సంబంధిత అధికారులు ఈ వికలాంగుని సమస్యలను పరిష్కరించి వారికి ఫించను మంజూరు చేయాలని లేనిపక్షంలో జనసేన పార్టీ దీనిపై తీవ్ర చర్యలు తీసుకుంటుందని గుడ్లూరు మండల జనసేన నాయకుడు అన్నంగి చలపతి అన్నారు.